Monday, October 6, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – కర్ణావతంసిత



10.1-770-సీ.
ర్ణావతంసిత ర్ణికారప్రభ;
 గండభాగద్యుతిఁ డలుకొలుప
భువనమోహనమైన భ్రూవిలాసంబుతో;
 వామభాగానతదన మొప్ప
పసవ్యకరమృదులాంగుళీ చాతురి;
 డ్జధ్వనికి మర్మ రణిఁ జూప
డాకాలిమీఁద నడ్డము చాఁచి నిల్పిన;
 దనఖద్యుతి భూమిఁ బ్రబ్బికొనఁగ
తే.
మౌళిపింఛముఁ గంఠదామును మెఱయ
విలసితగ్రామముగ నొక్క వేణువందు
బ్రహ్మగాంధర్వగీతంబు రఁగఁ జేసెఁ
తురనటమూర్తి గోపాలక్రవర్తి.
         మిక్కిలి చమత్కారమైన నటనాలతో మనసు లలరించే గోపాల చక్రవర్తి యైన శ్రీకృష్ణమూర్తి చెవిసందులో తురిమిన కొండగోగుపూల అందం, చెక్కిళ్ళ శోభను ఇనుమడిస్తుండగా; విశ్వాన్నంతటిని మోహింపజేసే బొమముడి సోయగా, లొప్పుతుండగా; ఎడమ పక్కకి వంచిన తల, చక్కదనాలు చిందిస్తుండగా; కోమలమైన కుడిచేతి వ్రేళ్ళ నైపుణ్యాలు షడ్ఝస్వరానికి, నర్మగర్భ అందాలు అద్దుతుండగా; ఎడమ కాలిమీద అడ్డంగా సాచి ఉంచిన కుడి కాలిగోర్లు, మేదిని మెరుపులు మెదుపుతుండగా; సిగలోని నెమలి పింఛము, మెడలోని వైజయంతీమాలల మిలమిలలు, మించుతుండగా; మురళిని మోవిపై నానించి గ్రామ మూర్చను లనే స్వరభేదాలు స్వచ్ఛంగా వెలయిస్తూ; బ్రహ్మగాంధర్వగీత మనే సామవేదగానం (ఆ శరదృతువులో గోవుల మేపుతూ) ఆలపించాడు.
10.1-770-see.
karNaavataMsita karNikaaraprabha;
gaMDabhaagadyuti@M gaDalukolupa
bhuvanamOhanamaina bhroovilaasaMbutO;
vaamabhaagaanatavadana moppa
napasavyakaramRdulaaMguLee chaaturi;
shaDjadhvaniki marma saraNi@M joopa
Daakaalimee@Mda naDDamu chaa@Mchi nilpina;
tae.
mauLipiMChamu@M gaMThadaamamunu meRaya
vilasitagraamamuga nokka vaeNuvaMdu
brahmagaaMdharvageetaMbu para@Mga@M jaese@M
jaturanaTamoorti gOpaalachakravarti..
            కర్ణా = చెవి యందు; అవతంసిత = సిగపువ్వుగా తురిమిన; కర్ణికార = కొండగోగిపువ్వు; ప్రభ = కాంతి; గండభాగ = చెక్కిలి పలకల; ద్యుతిన్ = కాంతిని; కడలు గొలుప = ఓడించగా; భువన = లోకములను; మోహనము = మోహింప జేయునది; ఐన = అయినట్టి; భూ = కనుబొమల; విలాసంబు = చక్కటి కదలికల; తోన్ = తోటి; వామ = ఎడమ; భాగ = పక్క; ఆనత = వంచబడిన; వదనము = మోము; ఒప్పన్ = అందగించుచుండగ; అపసవ్య = కుడి; కర = చేతి యొక్క; మృదుల = మృదువైన; అంగుళీ = వేళ్ళ యొక్క; చాతురి = నేర్పు; షడ్జమ = షడ్జమ స్వరము యొక్క; ధ్వని = ధ్వని; కిన్ = కి; మర్మ = రహస్య; సరణిన్ = మార్గమును; చూపన్ = చూపుచుండగా; డాకాలి = ఎడమకాలి; మీదన్ = మీద; అడ్డమున్ = అడ్డముగా; చాచి = చాపి; నిల్పిన = ఉంచినట్టి; పద = కాలి; నఖ = గోర్ల; ద్యుతి = కాంతి; భూమిన్ = నేలపైన; ప్రబ్బికొనగా = వ్యాపించగా.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

No comments: