Tuesday, October 21, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 2-100-క.- విశ్వాత్ముడు


2-100-క.
విశ్వాత్ముఁడు, విశ్వేశుఁడు,
విశ్వమయుం, డఖిలనేత, విష్ణుఁ, డజుం, డీ
విశ్వములోఁ దా నుండును
విశ్వము దనలోనఁ జాల వెలుఁగుచు నుండన్.
            బ్రహ్మదేవుడు, తన పుత్రుడు నారదునికి విష్ణుతత్వాన్ని ప్రభోధిస్తున్నాడు విశ్వమే తానైన వాడు; విశ్వమునకు ప్రభువు; విశ్వ మంతయు నిండి ఉండు వాడు; సర్వమునకు నడిపించు వాడు; విశ్వమును వ్యాపించి యుండువాడు; పుట్టుక లేని వాడు అయిన ఆ విష్ణువు జగత్తు లోపల ఉండును; జగత్తు సమస్తము ఆ విష్ణుని లోపలనే మిక్కిలి ప్రకాశిస్తూ ఉండును.
2-100-ka.
viSvaatmu@MDu, viSvaeSu@MDu,
viSvamayuM, Dakhilanaeta, vishNu@M, DajuM, Dee
viSvamulO@M daa nuMDunu
viSvamu danalOna@M jaala velu@Mguchu nuMDan.

            విశ్వాత్ముఁడు = విశ్వమే తానైనవాడు; విశ్వేశుఁడు = విశ్వమునకు ఈశ్వరుడు; విశ్వమయుండు = విశ్వమంతయు నిండి ఉన్నవాడు; అఖిలనేత = సర్వమునకు నడిపించువాడు; విష్ణుఁడు = నారాయణుడు {విష్ణువు = విశ్వమును వ్యాపించి యుండువాడు}; అజుండు = పుట్టుకలేని వాడు; = ; విశ్వము = జగత్తు; లోన్ = లోపల; తాన్ = తాను; ఉండును = ఉండును; విశ్వము = జగత్తు; తనన్ = తన; లోనన్ = లోపలనే; చాలన్ = మిక్కిలి; వెలుఁగుతున్ = ప్రకాశిస్తూ; ఉండున్ = ఉండును.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

No comments: