Tuesday, October 7, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 10.1-184-ఆ. ఏమినోముఫలమొ

10.1-184-ఆ.
మినోము ఫలమొ యింత ప్రొ ద్దొక వార్త
వింటి మబలలార! వీను లలర
న యశోద చిన్నిగవానిఁ గనె నట
చూచి వత్త మమ్మ! సుదతులార!
          ఓ సుందరమైన చెలులారా! ప్రొద్దునే లేస్తూనే ఇంత మంచి శుభవార్త చెవులార విన్నాం, ఏనాడు నోచిన నోముల ఫలితమో గానీ; మన యశోదమ్మ చిన్న పాపడిని కన్నదట. చూసి వద్దాం సుందరీమణులు! రండి రండి.
     నందనందనుడు పుట్టిన సందర్భంలో అనేక వేడుకలు, ఉత్సవాలు చేసుకుంటోంది గోకులం. ఆ పురిటికందును చూడటానికి గోపిక లిలా వొకరినొకరు లేపుకుంటు ఉత్సాహంగా బయలుదేరారు.
10.1-184-aa.
aeminOmu phalamo yiMta pro ddoka vaarta
viMTi mabalalaara! veenu lalara
mana yaSOda chinnimagavaani@M gane naTa
choochi vatta mamma! sudatulaara!
          ఏమి = ఎట్టి; నోము = వ్రతములు నోచిన; ఫలమొ = ఫలితముగనో; ఇంతప్రొద్దు = ఇప్పటికి; ఒక = ఒకానొక; వార్తన్ = శుభ వార్త మానమును; వింటిమి = విన్నాము; అబలలార = ఇంతులూ {అబల - బలము తక్కుగా ఉండునామె, స్త్రీ}; వీనులు = చెవులు; అలరన్ = ఆనందించగా; మన = మన యొక్క; యశోద = యశోద; చిన్ని = చంటి; మగవాని = మగపిల్ల వాడిని; కనెను = ప్రసవించెను; అటన్ = అట; చూచి = చూసి; వత్తము = వచ్చెదము; అమ్మ = అమ్మ; సుదతులార = సుందరీమణులారా {సుదతి - మంచి పలువరుస కలామె, అందగత్తె}.
సర్వేజనాః సుఖినోభవంతు|~~~

No comments: