Wednesday, August 13, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 380

యతులీశ్వరుని

1-274-క.
తు లీశ్వరుని మహత్త్వము
మి మెఱుఁగని భంగిఁ నప్రమేయుఁడగు హరి
స్థితి నెఱుఁగక కాముకుఁ డని
ములు సలుపుదురు తిగిచి మణులు సుమతీ!
          బుద్దిమంతుడైన శౌనకా! తపోనియతులైన యతులు కూడ పరమేశ్వరుని ప్రభావం ఇదమిత్థమని ఎరుగరు కదా అలాగే, అప్రమేయుడైన వాసుదేవుని మహత్త్వన్ని గుర్తించకుండా కాముకుడనే భావంతో రమణులందరూ ఆ రమారమణునితో క్రీడించారు.
1-274-ka.
yatu leeSvaruni mahattvamu
mita meRu@Mgani bhaMgi@M napramaeyu@MDagu hari
sthiti neRu@Mgaka kaamuku@M Dani
ratamulu salupuduru tigichi ramaNulu sumatee!
          యతులు = ఇంద్రియములను నియమించినవారు; ఈశ్వరుని = కృష్ణుని; మహత్త్వము = గొప్పదనము యొక్క; మితమున్ = పరిమాణమును / హద్దులను; ఎఱుఁగని = తెలిసికొనలేని; భంగిన్ = విధముగ; అప్రమేయుఁడు = మితము లేనివాడు; అగు = అయినట్టి; హరి = కృష్ణుని; స్థితిన్ = స్థితిని; ఎఱుఁగకన్ = తెలిసికొనలేక; కాముకుఁడు = కామ ప్రకోపముతో నుండువాడు; అని = అని; రతములు = సురతములు; సలుపుదురు = చేయుదురు; తిగిచి = ఆకర్షించి; రమణులు = స్త్రీలు; సుమతీ = మంచి బుద్ధి కలవాడా.

~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

No comments: