Tuesday, July 1, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 338

అన్యమెఱుగడు

10.1-332-తే.
అన్య మెఱుఁగఁడు; తన యంత నాడుచుండు;
మంచివాఁ డీత; డెగ్గులు మానరమ్మ!
రామలార! త్రిలోకాభిరామలార!
ల్లులార! గుణవతీమల్లులార!
          తల్లులల్లారా! మనోజ్ఞమైన మగువల్లారా! ముల్లోకాలకు మోదం కలిగించే ముదితల్లారా! నామాట వినండి. ఇతను ఇతరమైనదేది ఎరుగడు. తనంతట తనే క్రీడిస్తు ఉంటాడు. మా కన్నయ్య ఎంతో మంచివాడు అమ్మలార! సకల సద్గుణవతీ లలామల్లారా! ఇతనిపై నిందలు వేయకండమ్మా.
ఆ కపట శైశవ కృష్ణమూర్తి దొంగజాడల జేయు బాల్యచేష్టలను చెప్పుకుంటున్న ఓపికలు లేని గోపికలకు యశోదాదేవి నచ్చచెప్పుతోంది.
10.1-332-tae.
anya meRu@Mga@MDu; tana yaMta naaDuchuMDu;
maMchivaa@M Deeta; Deggulu maanaramma!
raamalaara! trilOkaabhiraamalaara!
tallulaara! guNavateematallulaara!
          అన్యమున్ = ఇతర మైన వేమి, తనకువేరైనది; ఎఱుగడు = తెలియనివాడు, అసలు లేని వాడు; తనయంతన్ = అతనంటతనే, ఆత్మా; ఆడుచుండున్ = ఆడుకొనుచుండును, రాముడు; మంచి వాడు = ఉత్తముడు; ఈతడు = ఇతను; ఎగ్గులు = చాడీలు; మానరు = మానివేయండి; అమ్మ = తల్లి; రామలార = మనోజ్ఞరాళ్ళూ; త్రిలోక = ముల్లోకములను; అభి = మిక్కిలి; రామలార = ఆనందింప జేసే ఇంతులూ; తల్లులారా = మా అమ్మలారా; గుణవతీమ తల్లులారా = సుగుణములు కల తల్లులు.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

No comments: