Monday, June 30, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 337

చనుదెంచెన్ ఘను

8-107-మ.
నుదెంచెన్ ఘనుఁ డల్లవాఁడె; హరి పజ్జం గంటిరే లక్ష్మి? శం
నినాదం బదె; చక్ర మల్లదె; భుజంధ్వంసియున్ వాఁడె; క్ర
న్న యేతెంచె నటంచు వేల్పులు నమోనారాయణాయేతి ని
స్వనులై మ్రొక్కిరి మింట హస్తిదురవస్థావక్రికిం జక్రికిన్.
          గజేంద్రుని ఆర్తి బాపటానికి ఆరాటంగా ఆకాశంలో వెళ్తున్న శ్రీమహావిష్ణువును చూసి దేవతలు అదిగదిగో మహనీయుడైన విష్ణుమూర్తి వస్తున్నాడు. అతని వెనుకనే శ్రీమహాలక్ష్మి వస్తున్నది చూడండి. అదిగో పాంచజన్య శంఖధ్వని. సర్పాలను సంహరించేవాడు గరుత్మంతుడు అదిగో చూడండి వెంట వస్తున్నాడు. అనుకుంటు నారాయణునికి నమస్కారం అంటు నమస్కారాలు చేస్తున్నారు.
8-107-ma.
chanudeMchen ghanu@M Dallavaa@MDe; hari pajjaM gaMTirae lakshmi? SaM
kha ninaadaM bade; chakra mallade; bhujaMgadhvaMsiyun vaa@MDe; kra
nnana yaeteMche naTaMchu vaelpulu namOnaaraayaNaayaeti ni
svanulai mrokkiri miMTa hastiduravasthaavakrikiM jakrikin.
          చనుదెంచెన్ = వచ్చినాడు; ఘనుడు = గొప్పవాడు; అల్ల = అక్కడి; వాడె = అతడే; హరి = విష్ణువు; పజ్జన్ = పక్కనే; కంటిరే = చూసితిరా; లక్ష్మిన్ = లక్ష్మీదేవిని; శంఖ నినాదంబు = పాంచజన్య శంఖ ధ్వని; అదె = అక్కడ నున్నదే; చక్రము = సుదర్శన చక్రము; అల్లదె = అక్క డున్నదే; భుజంగ ధ్వంసియున్ = గరుత్మంతుడు; వాడె = అతడే; క్రన్ననన్ = వరుసగా; ఏతెంచెన్ = వచ్చిరి; అట = అని; అంచున్ = అనుచు; వేల్పులు = దేవతలు; నమో = నమస్కారము; నారాయణ = నారయణునికి; ఇతి = ఇది యనెడి; నిస్వనులు = పలికెడివారు; = అయ్యి; మ్రొక్కిరి = నమస్కరించిరి; మింటన్ = ఆకాశము నందు; హస్తి దురవస్థా వక్రికిన్ = హరికి {హస్తి దురవస్థా వక్రి - హస్తి (ఏనుగు యొక్క) దురవస్థ (ఆపదను) వక్రి (మరలించెడివాడు), విష్ణువు}; చక్రికిన్ = హరికి {చక్రి - చక్రము ఆయుధముగాగల వాడు, విష్ణువు}.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

No comments: