Thursday, May 15, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 288

ఈశ్వరుండు

1-213-ఆ.

శ్వరుండు విష్ణుఁ డెవ్వేళ నెవ్వని
కేమిసేయుఁ బురుషుఁ డేమి యెఱుఁగు
తనిమాయలకు మహాత్ములు విద్వాంసు
డఁగి మెలగుచుందు రంధు లగుచు.
          పరమేశ్వరుడైన శ్రీమన్నారాయణుడు ఎప్పుడు ఎవరికి ఏమి చేస్తాడో ఎవరు చెప్పగలరు. ఆ మహానుభావుని మాయలకు పెద్ద పెద్ద విద్వాంసులు సైతం దిక్కు తెలియనివారై, లోబడి అణిగి మణిగి ఉంటారు.
అంపశయ్యపై నున్న కురువృద్ధుడు భీష్ములవారు తనని చూడటానికి వచ్చిన ధర్మరాజాదులతో మాట్లాడుతు కృష్ణభగవానుని మహాత్యం చెప్తున్నారు.
1-213-aa.
eeSvaruMDu vishNu@M DevvaeLa nevvani
kaemisaeyu@M burushu@M Daemi yeRu@Mgu
natanimaayalaku mahaatmulu vidvaaMsu
laDa@Mgi melaguchuMdu raMdhu laguchu.
ఈశ్వరుండు = నారాయణుడు {ఈశ్వరుడు - ఈశత్వము (ప్రభుత్వము) కలవాడు}; విష్ణుఁడు = నారాయణుడు; ఎవ్వేళ = ఏ సమయమునకు; ఎవ్వని = ఎవని; కిన్ = కి; ఏమి = ఏమి; సేయున్ = చేయునో; పురుషుఁడు = మానవుడు; ఏమి = ఏమి; యెఱుఁగున్ = తెలియగలడు; అతని = అతని యొక్క; మాయలు = మహిమలు; కు = కి; మహాత్ములు = గొప్పవారు; విద్వాంసులు = పండితులు; అడఁగి = లొంగి; మెలగుచూ = చరిస్తూ; ఉందురు = ఉంటారు; అంధులు = గ్రుడ్డివారు; అగుచున్ = అవుతూ.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

No comments: