Sunday, April 20, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 264

ఎల్లప్పుడు


1-275-క.
ల్లప్పుడు మా యిండ్లను
ల్లభుఁడు వసించు; నేమ ల్లభలము శ్రీ
ల్లభున కనుచు గోపీ
ల్లభుచే సతులు మమత లఁ బడి రనఘా!
          ఓ పుణ్యవంతుడైన శౌనక! మా వల్లభుడు మా గృహాలను ఎప్పుడు వదలిపెట్టడు, రమావల్లభు డైన యదువల్లభునకు మేమే ప్రియమైన వారమని భావిస్తు ఆ భామ లందరు యశోదానందనుని వలపుల వలలో చిక్కుకొన్నారు.
శ్రీకృష్ణుడు ద్వారకకు తిరిగొచ్చి తన స్త్రీలను పలకరించిన ఘట్టం చెప్తు సూతుడు వారిని, భక్తు లందరికి నావాడే అనిపించే కృష్ణతత్వన్ని ఇలా వర్ణించారు.
1-275-ka.
ellappuDu maa yiMDlanu
vallabhu@MDu vasiMchu; naema vallabhalamu Sree
vallabhuna kanuchu gOpee
vallabhuchae satulu mamata vala@M baDi ranaghaa!
          ఎల్లప్పుడు = ఎప్పుడు; మా = మా యొక్క; ఇండ్లను = ఇండ్ల యందే; వల్లభుఁడు = భర్త; వసించు = ఉండును; నేమ = మేమే; వల్లభలము = ప్రియ మైన వారము; శ్రీవల్లభు = కృష్ణున {శ్రీవల్లభుడు - లక్ష్మీపతి, విష్ణువు}; కున్ = కు; అనుచున్ = అంటూ; గోపీవల్లభు = కృష్ణుడు {గోపీవల్లభుడు - గోపికలకు ప్రియుడు, కృష్ణుడు}; చేన్ = చేత; సతులు = భార్యలు; మమత = మమకార మనెడి; వలన్ = వలలో; పడిరి = తగలు కొనిరి; అనఘా = పాపము లేనివాడా.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

No comments: