Friday, April 18, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 262

సకలప్రాణి

1-185-మ.
ల ప్రాణిహృదంతరాళముల భాస్వజ్జ్యోతియై యుండు సూ
క్ష్మళుం డచ్యుతుఁ డయ్యెడన్ విరటజా ర్భంబుఁ దాఁ జక్రహ
స్తకుఁడై వైష్ణవమాయఁ గప్పి కురు సంతానార్థియై యడ్డమై
ప్రటస్ఫూర్తి నడంచె ద్రోణతనయ బ్రహ్మాస్త్రమున్ లీలతోన్.
            అప్పుడు సూక్ష్మాతిసూక్ష్మ రూపంతో సమస్త ప్రాణుల హృదయాంతరాళ్ళల్లో జ్యోతిర్మూర్తి యై ప్రకాశించే వాసుదేవుడు పాండవుల వంశాంకురమైన ఉత్తర గర్భంలో పిండ రూపంలో ఉన్న పరీక్షిత్తును రక్షించటం కోసం చక్రాన్ని ధరించాడు. ఉత్తరాగర్భాన్ని యోగమాయతో కప్పివేసి, విశ్వమంతా వ్యాపించి ఉండే వాడు తన అమోఘమైన వైష్ణవ తేజస్సుతో అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని అవలీలగా అణచివేశాడు.
1-185-ma.
sakala praaNihRdaMtaraaLamula bhaasvajjyOtiyai yuMDu soo
kshmakaLuM Dachyutu@M DayyeDan viraTajaa garbhaMbu@M daa@M jakraha
staku@MDai vaishNavamaaya@M gappi kuru saMtaanaarthiyai yaDDamai
prakaTasphoorti naDaMche drONatanaya brahmaastramun leelatOn.
          సకల = సమస్త మైన; ప్రాణి = ప్రాణుల యొక్క; హృద = హృదయముల; అంతరాళములన్ = లోలోపల; భాస్వత్ = ప్రకాశించే; జ్యోతి = దీపము; = అయ్యి; ఉండు = ఉండే; సూక్ష్మ = సూక్ష్మ మైన; కళుండు = నేర్పున్న వాడు; అచ్యుతుఁడు = హరి {అచ్యుతుడు – చ్యుతము లేని వాడు / విష్ణువు}; = ; ఎడన్ = సమయములో; విరటజా = ఉత్తర యొక్క {విరటజ - విరటుని సంతానము / ఉత్తర}; గర్భంబున్ = గర్భమును; తాన్ = తాను; చక్ర = చక్రమును; హస్తకుఁడు = చేతియందు ధరించిన వాడు; = అయ్యి; వైష్ణవ = విష్ణువు {విష్ణువు – విశ్వమంతా వ్యాపించి ఉండు వాడు / హరి} యొక్క; మాయన్ = మాయను; కప్పి = కప్పి; కురు = కురువంశ; సంతాన = సంతానమును; అర్థి = కోరినవాడు; = అయ్యి; అడ్డము = అడ్డముగా నిలబడిన వాడు; = అయ్యి; ప్రకట = అభివ్యక్త మైన; స్ఫూర్తిన్ = స్పూర్తితో; అడంచెన్ = అణచెను; ద్రోణతనయు = అశ్వత్థామ  {ద్రోణతనయుడు - ద్రోణుని కుమారుడు / అశ్వాత్థామ}; యొక్క; బ్రహ్మాస్త్రమున్ = బ్రహ్మాస్త్రమును; లీల = అవలీల / లీలావిలాసము; తోన్ = గా.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

No comments: