Saturday, March 29, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 242

నిగమములు

1-141-క.
నిమములు వేయుఁ జదివిన
సుమంబులు గావు ముక్తి సుభగత్వంబుల్
సుమంబు భాగవత మను
నిమంబుఁ బఠింప ముక్తి నివసనము బుధా!
          బుధశ్రేష్ఠుడా! వేలకొద్దీ వేదాలను ఎంత చదివినా మోక్షసంపదలు అందుకోడం అంత సుళువు కాదు. అదే భాగవతము అనే వేదాన్ని పఠిచటం ద్వారా అయితే అతి సులువుగా దొరుకుతుంది మోక్షం.
అని సూతమహర్షి శౌనకమునీశ్వరునకు తెలియజెప్పాడు.
1-141-ka.
nigamamulu vaeyu@M jadivina
sugamaMbulu gaavu mukti subhagatvaMbul
sugamaMbu bhaagavata manu
nigamaMbu@M baThiMpa mukti nivasanamu budhaa!
          నిగమములు = వేదములు; వేయున్ = వేలకొలది; చదివినన్ = పఠించిన; సుగమంబులు = సులభముగ అర్థము అగునవి; కావు = కావు; ముక్తి = ముక్తినిచ్చు; సుభగత్వంబుల్ = సౌభాగ్యము కలవి; సుగమంబు = సులభముగ అర్థమగునదైన; భాగవతము = భాగవతము; అను = అనబడే; నిగమంబున్ = వేదమును; పఠింప = చదివిన; ముక్తి = ముక్తి; నివసనము = నివాసమగును; బుధా = బుద్ధిమంతుడా.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

No comments: