Sunday, March 2, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 215

శ్రీమద్భక్తచకోరక

 

2-1-క.
శ్రీద్భక్త చకోరక
సో! వివేకాభిరామ! సురవినుత గుణ
స్తో! నిరలంకృతాసుర
రామా సీమంతసీమ! రాఘవరామా!
          భక్తులు అనెడి చకోరక పక్షులకు చంద్రుని వంటివాడా! వివేకముతో విలసిల్లు వాడా! దేవతలచేత పొగడబడిన సుగుణములు గలవాడా! (రాక్షసులను సంహరించి) రాక్షస స్త్రీల పాపిట సింధూరాలంకరణలు తొలగించిన వాడ! రఘు వంశోద్భవుడవైన శ్రీరామచంద్రప్రభూ! అవధరింపుము.
2-1-ka.
Sreemadbhakta chakOraka
sOma! vivaekaabhiraama! suravinuta guNa
stOma! niralaMkRtaasura
raamaa seemaMtaseema! raaghavaraamaa!
          శ్రీమత్ = గొప్పవారైన; భక్త = భక్తులు అను; చకోరక = చకోరపక్షులకు; సోమ = చంద్రుడా; వివేక = వివేకమువలన; అభిరామ = సుందర మైన వాడా; సుర = దేవతలచే; వినుత = పొగడబడుచున్న; గుణ = గుణముల; స్తోమ = సమూహము గల వాడా; నిరలంకృత = నష్ట మైన అలంకారములు గల; అసుర = రాక్షస; రామా = స్త్రీల; సీమంత = పాపిటలు; సీమ = ప్రాంతము కలగజేసిన వాడా; రాఘవ = రఘు వంశమున జన్మించిన; రామా = రాముడా.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

No comments: