Sunday, February 2, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 190

కాననివాని

7-182-ఉ.
కానివాని నూఁత గొని కాననివాఁడు విశిష్ట వస్తువుల్
గాని భంగిఁ గర్మములు గైకొని కొందఱు కర్మబద్ధులై
కారు విష్ణుఁ, గొంద ఱటఁ గందుఁ రకించన వైష్ణవాంఘ్రిసం
స్థా రజోభిషిక్తు లగు సంహృత కర్ములు దానవేశ్వరా!
          ఓ రాక్షసేంద్ర! ఒక గుడ్డివాడు మరొక గుడ్డివాని తోడు తీసుకొని ఏ వస్తువును విశేషించి చూడలేడు. అదేవిధంగా మానవులు కర్మములను చేస్తూ, ఆ కర్మముల చేతనే బద్ధులయి విష్ణుమూర్తిని చూడలేరు. కొందరు పుణ్యపురుషులు మహాత్ములైన విష్ణుభక్తుల పాదపరాగలను ధరించి, కర్మలను త్యజించి, స్వామిని దర్శించ గలుగుతారు. అంతేగాని ఈ సంసార లంపటంలో కొట్టుమిట్టాడేవారు భగవంతుణ్ణి ఎన్నటికి దర్శించలేరు అంటు ప్రహ్లాదుడు తన తండ్రి హిరణ్యకశిపునికి వివరించాడు.
7-182-u.
kaananivaani noo@Mta goni kaananivaa@MDu viSishTa vastuvul
gaanani bhaMgi@M garmamulu gaikoni koMdaRu karmabaddhulai
kaanaru vishNu@M, goMda RaTa@M gaMdu@M rakiMchana vaishNavaaMghrisaM
sthaana rajObhishiktu lagu saMhRta karmulu daanavaeSvaraa!
          కానని = చూడలేని; వానిన్ = వానిని; ఊతన్ = ఊతముగ; కొని = తీసుకొని; కానని = గుడ్డి; వాడు = వాడు; విశిష్ట = శ్రేష్ఠమైన; వస్తువుల్ = వస్తువులను; కానని = చూడలేని; భంగిన్ = వలె; కర్మములున్ = కర్మలను; కైకొని = చేపట్టి; కొందఱు = కొంతమంది; కర్మ = కర్మలకు; బద్దులు = బద్ధమైనవారు; = అయ్యి; కానరు = చూడజాలరు; విష్ణున్ = నారాయణుని; కొందఱు = కొంతమంది; అటన్ = అక్కడ; కందురు = పొందెదరు; అకించన = గొప్పవా రైన; వైష్ణవ = విష్ణుభక్తుల; అంఘ్రి = పాదముల; సంస్థాన = తగిలిన; రజః = ధూళిచేత; అభిషిక్తులు = అభిషేకింపబడిన వారు; అగు = అయిన; సంహృత = విడిచిపెట్టిన; కర్ములు = కర్మములు గలవారు; దానవేశ్వరా = హిరణ్యకశిపుడ.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

2 comments:

gajula sridevi said...

రావుగారు నమస్కారములు.నిజంగా ఎంత ఓపిగ్గా ,అద్భుతంగా రాస్తున్నారండి.ఎప్పుడో చిన్నప్పుడు ఒక పద్యమిచ్చి దానికి ప్రతిపదార్ధముతో కూడిన వివరణ రాయమనేవారు.మీ భాగవతం చూసినప్పుడల్లా నాకదే జ్ఞాపకం వస్తోంది.నిజంగా ఎంత పుణ్యం చేస్తే పోతనగారి భాగవతం ఇంత సరళమైన భాషలో మన ఇంటిలోకి వస్తుంది .ఇప్పుడు కూడా చదవకపోతే ఇక వారిని.......మీరు ఇటువంటి పనికి పూనుకోవడం మీలోని సమాజ సంస్కరణ లక్ష్యానికి నిదర్శనం. మీకు ధన్యవాదములు.

vsrao5- said...

+sridevi gajula నమస్కారమండి. మీ అభిమానానికి, పోతన తెలుగు భాగవతం మీద మీ ఆసక్తికి ధన్యవాద సుమాంజలులు. నాకదే జ్ఞాపకం వస్తోంది అనటంలో, మీ స్పందనలో మీ సహృదయత హృదయ వైశాల్యము కనిపిస్తున్నాయి. అభినందనలు. తల్లీ ఇక్కడ ఉన్నదంతా శ్రీమద్భాగవత వైభవం, పోతనామాత్యుల అవిరళ అనితరసాధ్య కృషి ప్రసాదం.
మీలాంటి వారి ఆత్మీయ ఆదర ప్రోత్సాలతో మరింత మెరుగుగా చేయుటకు ప్రయత్నిస్తాను. పందిమంది మంచికోరే వాళ్ళు ఉంటే అంతకన్నా బలం ఏం ఉంటుంది చెప్పండి ఎవరికైనా.
మీ ఆదరాన్ని సదా కాంక్షించే - . .