Monday, January 13, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 169

bhooshaNamulu

1-46-క.
భూణములు వాణికి నఘ
శోణములు మృత్యుచిత్త భీషణములు హృ
త్తోణములు కల్యాణ వి
శేణములు హరి గుణోపచిత భాషణముల్.

                శ్రీమహా విష్ణువు యొక్క గుణకీర్తనములతో కూడిన పలుకులు, వాక్కులకు అధిదేవత యైన సరస్వతీ దేవికి అలంకారములు. మృత్య దేవతకు భయం కలిగించేవి. భక్తుల హృదయాలకు సంతోషాలు కలిగించేవి. సకల పాపాలను పరిహరించేవి. నిత్యకల్యాణములను సమకూర్చునవి.
శౌనకాది మహర్షులు పుణ్యమూలుని శ్రీమన్నారాయణుని కథలతో కూడిన భాగవతాన్ని చెప్పమని సూత మహర్షిని  అడుగుతు, విష్ణుకథల మహత్వాన్ని  ఇలా స్మరిస్తున్నారు.

1-46-ka.
bhooshaNamulu vaaNiki nagha
SOshaNamulu mRtyuchitta bheeshaNamulu hR
ttOshaNamulu kalyaaNa vi
SaeshaNamulu hari guNOpachita bhaashaNamul.

          భూషణములు = అలంకారములు; వాణి = సరస్వతి / వాక్కు; కిన్ = కి; అఘ = పాపములను; శోషణములు = ఇంకునట్లు చేయునవి; మృత్యు = మృత్యువు యొక్క; చిత్త = మనసునకు; భీషణములు = భయం కలిగించేవి; హృత్ = హృదయమునకు; తోషణములు = తుష్టి కలిగించేవి; కల్యాణవిశేషణములు = శుభకరమైన; విశేషణములు = విశిష్టతలను ఇచ్చునవి; హరి = హరియొక్క; గుణ = గుణములతో; ఉపచిత = కూడిన; భాషణముల్ = పలుకులు.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

4 comments:

Meraj Fathima said...

మీ పద భూషణములకు వినమ్రముగా మొక్కుతున్నాను.

vsrao5- said...

ధన్యవాదాలు మెరాజ్ గారు. మీ వినయ ఔదార్య సంపద సర్వదా ప్రశంసనీయం.

vsrao5- said...
This comment has been removed by the author.
vsrao5- said...
This comment has been removed by the author.