Friday, January 3, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 160



kavakavanai

6-100-క.
కవనై పదనూపుర
రవ లాగుబ్బుకొన్న తిపతి గతులం
జిచివనై విటు చెవులకు
ళిన్ రతిసల్పు రతుల వరవ గనియెన్.

                వెలయాలి కాలి అందెలు ఒకదానితో ఒకటి పోటీపడి మరీ ఘల్లు ఘల్లు మంటున్నాయి. ఆ గజ్జల రవాలు విటునికి వీనుల విందులు చేస్తున్నాయి. ఇలా ఒకరి పైకి ఒకరు ఎగబడుతు సాగిస్తున్న సంభోగ చమత్కారాలను అజామిళుడు ఆలోకించాడు.
మన పోతనా మాత్యుల వారు భాగవతంలో శృంగార రస పట్టు సాధించటేమే కాదు. కామకేళి సల్పుతున్న వృషలి వర్ణణతో పండితులను సైతం మెప్పించిన తీరు అద్భుతం

6-100-ka.
kavakavanai padanoopura
ravarava laagubbukonna ratipati gatulaM
jivachivanai viTu chevulaku
ravaLin ratisalpu ratula ravarava ganiyen.

          కవకవను = కవకవ మని ధ్వనించునవి; = అయ్యి; పదనూపుర = కాలి గజ్జలు; రవరవలు = ధ్వనులు; ఆగుబ్బుకొన్న = అతిశయించుతున్న; రతిపతి = మన్మథ; గతులన్ = క్రీడలో; చివచివన్ = చివచివలాడెడిది; = అయ్యి; విటు = విటుని; చెవులు = చెవుల; కున్ = కు; రవళిన్ = చిరుశబ్దముతో; రతిన్ = కామకేళి; సల్పు = చేస్తున్న; రతుల = సంభోగపు; రవరవన్ = స్పర్ధను; కనియెన్ = కాంచెను.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

No comments: