Saturday, December 21, 2013

తెలుగు భాగవత తేనె సోనలు – 147


iMdiMdi raati

9-603-క.
ఇందింది రాతి సుందరి
యిందిందిర చికుర యున్న దిందింద; శుభం
బిం దిందువంశ; యను క్రియ
నిందీవరవీథి మ్రోసె నిందిందిరముల్.

          సన్నివేశానికి తగిన ఇంది ప్రాసతో కూడిన వృత్యను ప్రాసాలంకా రాదులుతో, రాబోయే సమాగమానికి అనుగుణమైన రాయంచ నడకలుతో రక్తి కట్టిస్తు, చమత్కారాలు పోతున్న ఈ అందమైన కందం మనోహర మైన దుష్యంతుని చరిత్రలోది. దుష్యంతుడు కణ్యాశ్రమానికి వస్తున్న సమయంలో
ఓ చంద్రవంశోద్ధారకా! లక్ష్మీదేవికంటె అందగత్తె, తుమ్మెదల వంటి ముంగురులు గల సుందరి శకుంతల ఇక్కడే ఉంది. నీకు శుభం కలుగుతుంది. అన్నట్లుగా కలువపూలల్లో తిరుగుచున్న తుమ్మెదలు ఝంకారాలు చేశాయి.

9-603-ka.
iMdiMdi raati suMdari
yiMdiMdira chikura yunna diMdiMda; SubhaM
biM diMduvaMSa; yanu kriya
niMdeevaraveethi mrOse niMdiMdiramul.

ఇందిందిర = లక్ష్మీదేవి; అతి = కంటె నెక్కువ; సుందరి = అందమై నామె; ఇందిందిర = తుమ్మెదల వంటి; చికుర = ముంగురులు కలామె; ఉన్నది = ఉంది; ఇందిందన్ = దగ్గరలోనే; శుభంబు = మంచి జరుగును; ఇందు = ఇక్కడ; ఇందువంశ = చంద్ర వంశస్తుడా; అను = అనుచున్న; క్రియన్ = విధముగ; ఇందీవర = నల్ల కలువల; వీథిన్ = సమూహము నందు; మ్రోసెన్ = ఝంకారము చేసినవి; ఇందిందిరముల్ = మధుపములు .
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

No comments: