Tuesday, November 19, 2013

తెలుగు భాగవత తేనె సోనలు – 117




ammaa


1-507-క.
మ్మా! నినుఁ జూచిన నరుఁ
బొమ్మా యని ముక్తి కడకుఁ బుత్తు వఁట కృపన్
లెమ్మా నీ రూపముతో
మ్మా నా కెదుర గంగ! మ్యతరంగా!"
          మనోహర అలలతో అలరారే గంగమ్మతల్లి!నిన్ను దర్శించినంత మాత్రంచేతనే మోక్షానికి పంపిస్తావని విన్నాను, కదిలి రావమ్మా! కనికరించమ్మా!
          పుణ్యంతో స్వర్గప్రాప్తిస్తుంది. అర్హుడైన జ్ఞాని వైరాగ్యం పొంది తగిన సమయ మెరిగి చేసిన ప్రాయోపవేశంతో మోక్షం ప్రాప్తిస్తుంది. ఏ ఒక్కటి లేకపోయినా అది ఆత్మహత్యే, మహాపాపమే. పరమ జ్ఞాని పరీక్షిన్మహారాజుకి అర్హత ఉంది. శృంగిశాప మెరుగుటచే వైరాగ్యం సిద్దించింది. తక్షకవిషంతో  మరణం తప్పదని తెలిసిన ఆ సమయం తగింది. పరమ పావనమైన గంగానది తగిన స్థలం. అప్పుడు అక్కడ పరీక్షిన్మహారాజు ప్రాయోపవేశానికి సిద్ద మయ్యి గంగమ్మ తల్లిని స్తుతించేడు. పరమయోగి శుకుడు వచ్చి మహామంత్రరాజం మహాభాగవతం చెప్పాడు. పరీక్షిత్తు మోక్షాన్ని అందుకున్నాడు.
1-507-ka.
ammaa! ninu@M joochina naru@M
bommaa yani mukti kaDaku@M buttu va@MTa kRpan
lemmaa nee roopamutO
rammaa naa kedura gaMga! ramyataraMgaa!"
అమ్మా = తల్లీ; నినున్ = నిన్ను; చూచిన = దర్శించిన మాత్రముననే; నరున్ = మానవుని; పొమ్మా = వెళ్ళు; అని = అని; ముక్తి = మోక్షము; కడ = వద్ధ; కున్ = కి; పుత్తువు = పంపుదువు; అఁటన్ = అట; కృపన్ = దయతో; లే = లేచిరా; అమ్మా = తల్లీ; నీ = నీయొక్క; రూపము = రూపము; తోన్ = తో; రా = రా; అమ్మా = తల్లీ; నాకు = నాకు; ఎదుర = ఎదురుగా; గంగ = గంగామాత; రమ్య = మనోహరమైన; తరంగా = కెరటాలు కలదానా.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

No comments: