Monday, October 14, 2013

తెలుగు భాగవత తేనె సోనలు – 86



daeva jagannaatha

 10.2-320-సీ.
దేవ! జగన్నాథ! దేవేంద్రవందిత!; వితతచారిత్ర! సంత పవిత్ర!
హాలాహాలాహార! హిరాజకేయూర!; బాలేందుభూష! సద్భక్తపోష!
సర్వలోకాతీత! ద్గుణసంఘాత!; పార్వతీహృదయేశ! వవినాశ!
రజతాచలస్థాన! జచర్మపరిధాన!; సురవైరివిధ్వస్త! శూలహస్త!
తే. లోకనాయక! సద్భక్తలోకవరద!
సురుచిరాకార! మునిజనస్తుతవిహార!
భక్తజనమందిరాంగణపారిజాత!
నిన్ను నెవ్వఁడు నుతిసేయ నేర్చు నభవ!
          బలి చక్రవర్తి కొడుకు బాణాసురుడు. వెయ్యి చేతులతో మహా శక్తిశాలి. అతని పట్టణం శోణపురం. అతను శంకరుని పరమ భక్తాగ్రేసరుడు. భక్తవత్సలు డైన పరమ శివుడు అతని కోరిక ప్రకారం కోట ద్వారం చెంత కాపలా ఉన్నాడు. తనను ఎదిరించి బాహుబలం చూప జాలిన వీరాధివీరుడు ఎవరు భూమండలంలో కనిపించటంలేదు. నా యుద్ద దురద తీర్చ గ లంతటి శత్రువుని ప్రసాదించు అంటు ప్రార్థిస్తున్నాడు. – ఓ దేవా! లోకైక నాథ! దేవేంద్రునిచే స్తుతింపబడు వాడ! పరిశుద్ధ మైన చరిత్ర గల వాడ! పరమ పవిత్రుడ! హాలాహల విషం భుజించిన వాడ! నాగరాజులు భుజ కీర్తులుగ కల వాడ! చంద్ర శేఖర! భక్త సంరక్షక! సర్వ లో కేశ్వర! సద్గుణాల ప్రోవా! పార్వతీ పతి! భవబంధ హర! కైలాస వాస! గజ చర్మ ధారి! రాక్ష సాంతకా! త్రిశూల ధారి! మునీశ్వరుల స్తోత్రా లందు ప్రస్పుట మగు వాడ! భక్తజనుల గుమ్మాల ముందున్న కల్పవృక్షమా! నిన్ను స్తుతింప జాలిన వారు ఎవ్వరు లేరు.
10.2-320-see.
daeva! jagannaatha! daevaeMdravaMdita!; vitatachaaritra! saMtata pavitra!
haalaahaalaahaara! yahiraajakaeyoora!; baalaeMdubhoosha! sadbhaktapOsha!
sarvalOkaateeta! sadguNasaMghaata!; paarvateehRdayaeSa! bhavavinaaSa!
rajataachalasthaana! gajacharmaparidhaana!; suravari vidhvasta! Soolahasta!
tae. lOkanaayaka! sadbhaktalOkavarada!
suruchiraakaara! munijanastutavihaara!
bhaktajanamaMdiraaMgaNapaarijaata!
ninnu nevva@MDu nutisaeya naerchu nabhava!
          దేవ = శివా; జగత్ = సర్వ లోకములకు; నాథ = ప్రభు వైన వాడ; దేవేంద్ర = దేవేంద్రునితో; వందిత = స్తుతింపబడు వాడ; వితిత = గొప్ప; చారిత్ర = చరిత్ర కల వాడ; సంతత = సదా; పవిత్ర = పవిత్ర మైన వాడా; హాలాహల = హాలాహలము అను విషమును; ఆహార = తిన్న వాడ; అహి రాజ = సర్ప రాజు; కేయూర = భుజ కీర్తులు గా కల వాడ; బాలేందు = బాల  చంద్రుడు; భూష = ఆభరణముగా కల వాడ; సత్ = మంచి; భక్త = భక్తులను; పోష = కాపాడు వాడ; సర్వ = ఎల్ల; లోక = లోకములకు; అతీత = అతీత మైన వాడా; సద్గుణ = సుగుణముల; సంఘాత = సమూహము కల వాడా; పార్వతీ = పార్వతీ దేవి యొక్క; హృదయ = హృదయమునకు; ఈశ = ప్రభు వైన వాడ; భవ = సంసార బంధములు; వినాశ = తొలగించు వాడ; రజతాచల = వెండికొండపై, కైలాస పర్వతముపై; స్థాన = నివసించు వాడ; గజ = ఏనుగు; చర్మ = చర్మమును; పరిధాన = కట్టుకొను వాడ; సురవైరి = రాక్షసులను {సుర వైరి - దేవతల శత్రువు, రాక్షసుడు}; విధ్వస్త = సంహరించు వాడ; శూల = త్రిశూలమును; హస్త = చేత పట్టుకొను వాడ; లోక = లోకములకు; నాయక = ప్రభువా; సత్ = మంచి; భక్త = భక్తులు; లోక = అందరికి; వరద = వరము లిచ్చు వాడ; సు = మంచి; రుచిర = ప్రకాశించు; ఆకార = స్వరూపము కల వాడ; ముని = ఋషు లైన; జన = వారి; స్తుత = స్తోత్రము లందు; విహార = విహరించు వాడ; భక్త = భక్తులు; జన = అందరికి; మందిర = ఇంటి; అంగణ = ముంగిళ్ళ యందలి; పారిజాత = కల్పవృక్షము వంటి వాడ; నిన్నున్ = నిన్ను; ఎవ్వడు = ఎవరు మాత్రము; నుతి = స్తోత్రము; చేయన్ = చేయుటను; నేర్చును = శక్తి కల వాడు; అభవ = శివా {అభవ - పుట్టుక లేని వాడు, శివుడు}.
 ~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

No comments: