Saturday, October 12, 2013

తెలుగు భాగవత తేనె సోనలు – 84

hari sarvaakRtulaM

7-277-మ.
రి సర్వాకృతులం గలం డనుచుఁ బ్రహ్లాదుండు భాషింప స
త్వరుఁ డై యెందును లేఁడు లేఁ డని సుతున్ దైత్యుండు తర్జింప శ్రీ
సింహాకృతి నుండె నచ్యుతుఁడు నానా జంగమ స్థావ రో
త్క గర్భంబుల నన్ని దేశముల నుద్దండ ప్రభావంబునన్.
7-277-ma.
hari sarvaakRtulaM galaM Danuchu@M brahlaaduMDu bhaashiMpa sa
tvaru@M Dai yeMdunu lae@MDu lae@M Dani sutun daityuMDu tarjiMpa Sree
narasiMhaakRti nuMDe nachyutu@MDu naanaa jaMgama sthaava rO
tkara garbhaMbula nanni daeSamula nuddaMDa prabhaavaMbunan.
          ఈ విధంగా ప్రహ్లాదుడు భగవంతుడు సర్వ నామ రూపధారులందు అంతట ఉన్నాడు అని చెప్తుంటే, హిరణ్యకశిపుడు ఎక్కడా లేడు అంటూ బెదిరిస్తున్నాడు. అప్పుడు విష్ణుమూర్తి మహా మహిమాన్విత మైన నరసింహ రూపంతో సర్వ చరాచరములు అన్నిటి యందు ఆవేశించి ఉన్నాడు.
          హరి = నారాయణుడు; సర్వ = ఎల్ల; ఆకృతులన్ = రూపము లందును; కలండు = ఉన్నాడు; అనుచున్ = అనుచు; ప్రహ్లాదుడు = ప్రహ్లాదుడు {ప్రహ్లాదుడు – ప్ర (విశిష్ట మైన) హ్లాదుడు (ఆనందము కల వాడు), విష్ణుభక్తుడు}; భాషింపన్ = పలుకగా; సత్వరుడు = తొందర గల వాడు; = అయ్యి; ఎందును = ఎక్కడను; లేడు = లేడు; లేడు = లేడు; అని = అని; సుతున్ = పుత్రుని; దైత్యుండు = రాక్షసుడు హిరణ్యకశిపుడు; తర్జింపన్ = బెదిరించగా; శ్రీ = శోభన యుక్త మైన; నరసింహ = నరసింహ; ఆకృతిన్ = రూపముతో; ఉండెన్ = ఉండెను; అచ్యుతుడు = నారాయణుడు; నానా = పలు రకముల; జంగమస్థావర = చరాచర; ఉత్కర = సమూహముల; గర్భంబులన్ = అంతర్భాగములలో; అన్ని = సమస్త మైన; దేశములన్ = చోటు లందును; ఉద్దండ = గొప్ప; ప్రభావంబునన్ = మహిమతో.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

No comments: