Sunday, September 22, 2013

తెలుగు భాగవత తేనె సోనలు - 62



12-1 Sree marudaSanapatiSayana 

12-1-క.
శ్రీ రుదశనపతిశయన!
కామిత ముని రాజ యోగి ల్పద్రుమ! యు
ద్ధా! ఘనజనకవరనృప
జామాతృవరేశ! రామచంద్రమహీశా!
          వాయుభక్షణ చేసే సర్పకులాధీశు డైన ఆదిశేషునిపై పవ్వళించే వాడా! కోరి చేరే మునులకు, రాజులకు, యోగులకు కోరికలు తీర్చే కల్పవృక్షం వంటి వాడా! ఉన్న తోన్నతుడా! గొప్పవా డైన జనకమహారాజు యొక్క ఘనత వహించిన అల్లుడా! రామచంద్ర మహాప్రభూ!
12-1-ka.
Sree marudaSanapatiSayana!
kaamitamuniraajayOgikalpadruma! yu
ddhaama! ghanajanakavaranRpa
jaamaatRvaraeSa! raamachaMdramaheeSaa!
          శ్రీ = శోభనకర మైన; మరు దశన పతి శయన = రామ {మరు దశన పతి శయనుడు -మరుత్ (గాలిని) అశన (భక్షణము చేసెడి వారి - సర్పాల) పతి (ప్రభు వైన ఆదిశేషుని పైన) శయనుడు (పరుండు వాడు), విష్ణువు}; కామిత ముని రాజ యోగి కల్పద్రుమ = రామ {కామిత ముని రాజ యోగి కల్పద్రుముడు - కామిత (కోరి ఆశ్రయించిన) ముని (ఋషులకు) రాజ (రాజులకు) యోగి (యోగులకు) కల్పద్రుముడు (కల్పవృక్షము వంటి వాడు), విష్ణువు}; ఉద్ధామ = రామ {ఉద్ధాముడు - స్వతంత్రుడు, విష్ణువు}; ఘన జనక వరనృప = రామ {ఘన జనక వరనృప జామాతృ వరేశుడు - ఘన (గొప్ప) జనక వరనృప (జనకమహారాజు యొక్క) జామాతృ (అల్లుళ్ళలో) వరేశ (ఘనత వహించిన వాడు), రాముడు}; రామచంద్ర మహీశా = రామ {రామచంద్ర మహీశుడు రామచంద్రు డనెడి మహీశుడు (భూమికి ప్రభువు, రాజు), రాముడు}.
http://telugubhagavatam.org/
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

No comments: