Thursday, September 12, 2013

తెలుగు భాగవత తేనె సోనలు_53


విడిచితి  

6-149-క.
విడిచితి భవబంధంబుల
డఁచితి మాయావిమోహ మైన తమంబు
న్నొడిచితి నరివర్గంబులఁ
చితి నా జన్మ దుఃఖ ర్మార్ణవమున్.
6-149-ka.
viDichiti bhavabaMdhaMbula
naDa@Mchiti maayaavimOha maina tamaMbu
nnoDichiti narivargaMbula@M
gaDachiti naa janma du@hkha karmaarNavamun^.
                యమభటులనుండి విడిపింపబడ్డ అజామిళుడు సత్యం గ్రహించి, నియమించు కుంటున్నాడు. – ఇదిగో భవబందాలను వదలివేసాను. మాయా మోహాలు అనే అజ్ఞానాంధకారాన్ని అణిచేసాను. కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు అనే ఆర్గురు శత్రువులను జయించాను. దుఃఖ పూరిత మైన జనన మరణా లనే సముద్రాన్ని తరించాను.
          6-149-క. విడిచితి = వదలేసాను; భవ = సాంసారిక; బంధంబులన్ = బంధములను; అడచితి = అణచివేసుకొన్నా; మాయా = మాయతో కూడిన; విమోహము = మోహ పూరితం; ఐన = అయిన; తమంబున్ = అజ్ఞానాన్ని; ఒడిచితిన్ = జయించాను; అరివర్గంబులన్ = అరిష్వర్గంబులను {అరిష్వర్గంబులు - 1కామ 2క్రోధ 3మోహ 4లోభ 5మద 6మాత్సర్యములు}; గడచితిన్ = దాటేసాను; ఆజన్మ = జనన మరణా లనే; దుఃఖ = దుఃఖ పూరిత; కర్మ కర్మబందాల; ఆర్ణవమున్ = సముద్రమును.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

No comments: