Friday, August 23, 2013

తెలుగు భాగవత తేనె సోనలు_33



రాజఁ raaja@MTa


1-212-ఉ.
                  రా జఁట ధర్మజుండు, సురరాజ సుతుం డట ధన్వి, శాత్ర వో
                  ద్వేక మైన గాండివము వి ల్లఁట, సారథి సర్వభద్ర సం
                   యోకుఁ డైన చక్రి యఁట, యుగ్ర గదాధరుఁ డైన భీముఁ డ
                   య్యాజికిఁ దోడు వచ్చు నఁట, యాపద గల్గు టి దేమి చోద్యమో?  
1-212-u.
raa ja@MTa dharmajuMDu, suraraaja sutuM DaTa dhanvi, Saatra vO
dvaejaka maina gaaMDivamu vi lla@MTa, saarathi sarvabhadra saM
yOjaku@M Daina chakri ya@MTa, yugra gadaadharu@M Daina bheemu@M Da
yyaajiki@M dODu vachchu na@MTa, yaapada galgu Ti daemi chOdyamO?
          కష్టాలు కలిగి నంతటితో భగవత్కృప లేనట్టు కాదు. ధర్మరాజాదులతో అపశయ్యమీద ఉన్న భీష్ముని ఆత్మీయ పలకరింపు లోనిది ఈ పద్యం – ధర్మరాజు అంతటి వాడు రాజు; మహావీరు డయినట్టి అర్జునుడు యోధుడు; శత్రు భయంకర మైనట్టి గాడీవం అతని ధనుస్సు; సర్వ సౌఖ్య ప్రదాత శ్రీకృష్ణుడు అతని రథసారధి; ప్రచండ మైన గదాదండం ధరించే భీముడు కొం డంత అండ; అయినా, ఇంతటి మహా మహిమాన్విత మైన సహాయ సంపత్తులు ఉన్నా ఈ పాండవులు అరణ్యవాసాలు, అఙ్ఞాతవాసాలు, అవమానాలు మొద లైన ఆపదలు ఎన్నో పొందారు. ఎంత ఆశ్చర్యం. 
        రా జఁట - రాజు = రాజు; అఁట = అట; ధర్మజుండు - ధర్మజుండు = ధర్మరాజు {ధర్మజుడు - యమధర్మరాజు పుత్రుడు, ధర్మరాజు}; సురరాజ సుతుం డట సురరాజ = ఇంద్రుని; సుతుండు = పుత్రుడు; అఁట = అట; ధన్వి అర్జునుడు { ధన్వి - ధనస్సు ధరించు వాడు, ర్జునుడు}; శాత్ర వోద్వేజక మైన - శాత్రవ = శత్రువులకు; ఉద్వేజకము = ఉద్వేగము; ఐన = అయినట్టి; గాండివము - గాండివము = గాండివము; వి ల్లఁట అతని విల్లు = ధనస్సు; అఁట = అట; సారథి - సారథి = రథం నడిపించు వాడు; సర్వ భద్ర సంయోజకుఁ డైన - సర్వ = సమస్త; భద్ర = శుభములను; సంయోజకుఁడు = కలిగించువాడు; ఐన = అయిన; చక్రి యఁట - చక్రి = చక్రధారి / కృష్ణుడు {చక్రి - చక్రము ధరించువాడు, కృష్ణుడు}; అఁట = అట; యుగ్ర గదాధరుఁ డైన - ఉగ్ర = భయంకరమైన; గదా = గదను; ధరుఁడు = ధరించువాడు; ఐన = అయి నట్టి; భీముఁ డ య్యాజికిఁ దోడు - భీముఁడు = భీముడు; = ; యాజి = యజ్ఞము చేసినవాని / ధర్మరాజు; కిఁన్ = కి; తోడు = తోడుగా; వచ్చు నఁట - వచ్చున్ = వచ్చును; అఁట = అట; యాపద గల్గు టి దేమి - ఆపద = విపత్తు; కల్గుట = కలుగుట; ఇది = ఇది; ఏమి = ఏమి; చోద్యమో = చిత్రమో. 
|| ఓం నమో భగవతే వాసుదేవాయః || 

2 comments:

Anonymous said...

ఆనందఃherjliss. pl remove word verification

vsrao5- said...

ఆనందః అన్నారు సంతోషం. మీకు చెప్పగలవాడను కాదు కాని. కొంచం కష్టపడు చాలు ఎంతో ఫలం ఇస్తా నంటున్నాడు మా నల్లనయ్య. ఇది స్వీయానుభవం.