Friday, July 26, 2013

తెలుగు భాగవత తేనె సోనలు_8

10.1-220-క.

ను నీకు గుడుపఁజాలెడి
నువారలు లేరు; నీవు నవలెననుచుం
నుఁగుడుపి మీఁద నిలుకడఁ
నుదానననంగ వేడ్కఁ నుఁ జనుఁ గుడుపన్.
బాలకృష్ణుని వద్దకు వస్తున్న శిశుహంతకి పూతన నీకు చను (బాలు/ట) పట్టించ గల నేర్పరులు ఎవరు లేరయ్య. ఇంక నువ్వు పోవాలి. అని లాలించింది. నీకు చను (బాలు/ట) పట్టించి అటుపిమ్మట మెల్లిగా (తప్పక) పోతాలే  అంటున్నట్లు ఉత్సాహంతో స్తన్యం ఇవ్వడానికి బయలుదేరింది.
బమ్మెర వారి లలిత లలిత పదాలలోని శబ్దార్థ అలంకార సంశోభిత కంద పద్య మాధుర్యం చూడండి. చను అన్న పదం అందంగా 6 సార్లు వచ్చింది. అర్థబేధాలూ స్పురిస్తున్నాయి. అంతేనా, చనవలె పదంలో బాల కృష్ణులు ఇక దుష్టశిక్షణకి బయలుదేరే సమయం ఆసన్నం అయింది అనే సూచన స్పురిస్తోంది. నిలుకడజనుదాన పదం ఆమె మరణం ధృవం అని సూచిస్తోంది. ఎంత దుష్ఠత వున్నా వారిలో లీన మైన ధన్యురాలు కదా మరి.
చను - చనున్ = చనుబాలను; నీకు గుడుపఁ జాలెడి - నీ = నీ; కున్ = కు; కుడుపన్ = తాగించుటకు; చాలెడు = సమర్థు లైన; చనువారలు = తగినవారు; లేరు = ఎవరూ లేరు; నీవు = నీవు; చనవలె ననుచుం జనుఁ గుడుపి - చనవలెన్ = వెళ్ళవలెను, చావవలెను; అనుచున్ = అనుచు; చను = చనుబాలు; కుడిపి = తాగించి; మీఁద - మీదన్ = ఆపైన; నిలుకడ - నిలుకడన్ = నెమ్మదిగా; జనుదాన ననంగ - చనుదానన్ = వెళ్ళెదను; అనగన్ = అనెడి; వేడ్కఁ జనుఁ జనుఁ గుడుపన్ - వేడ్కన్ = కుతూహలముతో; చనున్ = వెళ్ళును; చను = చనుబాలు; కుడుపన్ = తాగించుటకు.

  తెలుగుభాగవతం.కం  http://www.telugubhagavatam.com/

 || ఓం నమో భగవతే వాసుదేవాయః ||

No comments: